calender_icon.png 1 January, 2026 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా అయ్యప్ప స్వామి రథయాత్ర వేడుకలు

01-01-2026 12:52:02 AM

సుల్తానాబాద్ డిసెంబర్ 31 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ అయ్య ప్ప స్వామి దేవాలయం నుండి భక్తులు స్వా మివారి రథయాత్రను ఘనంగా నిర్వహించా రు, పట్టణంలోని పురవీధుల గుండా సాగిన రథయాత్రకు మహిళలు మంగళహారతుల తో స్వాగతం పలికారు, అయ్యప్ప స్వామి దీ క్ష దారుణ చేసిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేసిన భజనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి... శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సా యిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యం లో వేడుకలు ఘనంగా జరిగాయి... ఈ కార్యక్రమం లో చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ), ముస్త్యాల రవీందర్ పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొన్నారు.