calender_icon.png 1 May, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనులపై సబ్ కలెక్టర్ సమీక్ష

17-04-2025 09:01:50 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో కార్యాలయంలో కాటారం సబ్ కలెక్టర్ మాయంకా సింగ్ దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... మే నెల 15 నుండి 26వ తేదీ వరకు కాళేశ్వరంలో జరుగు సరస్వతీ నది పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, దేవస్థానం ఈవో ఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.