13 April, 2026 | 4:22 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

17-04-2025 08:53 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర...

కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో పాత నేరస్థులపై నిఘాను పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఆ ప్రమత్తంగా వివరించాలని తెలిపారు.