calender_icon.png 6 June, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న సబ్ జూనియర్ బాలుర హాకీ సెలక్షన్స్

04-06-2025 06:05:53 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ఉదయం ఏడు గంటలకి సబ్ జూనియర్ బాలుర హాకీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ హాకీ అసోసియేషన్(Karimnagar Hockey Association) ఇన్చార్జి సెక్రెటరీ మహమ్మద్ తారీక్ అలీ, జాయింట్ సెక్రెటరీ టి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సెలక్షన్స్ లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, హాకీ ఇండియా ఐడి కార్డు జిరాక్స్ తో హాజరుకావాలని సూచించారు. సెలక్షన్ అయిన క్రీడాకారులు ఈనెల 9 నుండి11 వరకు అదిలాబాద్ జిల్లాలో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు.