10 March, 2026 | 6:30 AM

ముత్తారం మండలంలో ఉప సర్పంచ్‌లు వీరే...

14-12-2025 10:54 AM

ఈ నెల 20న ప్రమాణ స్వీకారం

హరిపురం ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిదా

 ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో  మండలంలో 15 గ్రామ పంచాయతీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగగా మండలంలోని 15 గ్రామ పంచాయతీ లలో  సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. అదేవిధంగా 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక హరిపురం మినహా మిగతా 14 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లను సైతం ఎన్నుకున్నారు.

ఇందులో ఖమ్మంపల్లి ఉపసర్పంచ్ గా కారుకూరి సతీష్‌, ఇప్పలపల్లి కల్పన, సీతంపేట ఇందారపు నవీన్‌, జిల్లెలపల్లి జన్నె శ్రీవాణి ప్రవీణ్‌, ముత్తారం అమ్ము రజిత శ్రీనివాస్‌, ఓడేడు దాసరి ప్రశాంత్‌, పారుపల్లి బోడ శ్యామల పాపయ్య, లక్కారం చల్లూరి రాజ్‌కుమార్‌, మచ్చుపేట బి.రాకేష్‌, అడవీ శ్రీరాంపూర్‌ అనవేన హరిత తిరుపతి, పోతారం తూడూరి శారద నరేందర్‌, మైదంబండ రామస్వామి, దరియాపూర్‌ సమ్మక్క, కేశనపల్లి సింగనవేన సదయ్యలు ఎన్నికయ్యారు. ఈ నెల 20 తేదీన  సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరనున్నారు.    కాగా కొత్త పాలకులు కొలువుదీరనుండటంతో గ్రామాలోని సమస్యలు పరిష్కారవుతాయని గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.