calender_icon.png 14 December, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో రెండో విడత ఎన్నికలు

14-12-2025 10:53:17 AM

బారులు తీరిన ఓటర్లు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఆదివారం ఉదయం 9.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అస్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందన్నారు. ఉదయం 9.00 గంటల వరకు జిల్లాలో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, అందులో 43,068 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మొత్తం పోలింగ్ శాతం 21.93 శాతంగా నమోదైందన్నారు.

మండలాల వారీగా పోలింగ్ శాతం అన్నపురెడ్డిపల్లి మండలంలో 25.70%, అస్వారావుపేటలో 30.14%, చంద్రుగొండలో 25.80%, చుంచుపల్లిలో 13.66%, దమ్మపేటలో 26.65%, ములకలపల్లిలో 24.58%, పాల్వంచలో *8.04%గా నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో  ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగియనుండడంతో, ఇంకా ఓటు వేయని ఓటర్లందరూ సమీప పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.