జిల్లా మ్యారేజ్ బ్యూరో నూతన కార్యవర్గ ఎన్నిక
కోదాడ: తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ ఎదురుగా ఉన్న సీతారామ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యుడు, అధ్యక్షుడు డాక్టర్ నరాల రుక్క రావు అన్నారు.
సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా వట్టికుటి గురవయ్య, ప్రధాన కార్యదర్శిగా మోత్కూరి రాఘవచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాయల సతీష్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్, మహిళ ఉపాధ్యక్షురాలుగా భారతి, అన్నపూర్ణ, కార్యదర్శిగా చలపతి, మహిళా కార్యదర్శిగా సైదమ్మ, సహాయ కార్యదర్శిగా రాణి, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
స్టేట్ మ్యారేజ్ బ్యూరో సర్వసభ్య సమావేశం నిర్వహించన అనంతరం అన్ని వర్గాల మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ల తో సర్వసభ్య సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మ్యారేజ్ బ్యూరో ప్రధాన కార్యదర్శి షేక్ అండ్ రఫీ, కోశాధికారి లక్ష్మల్ల శ్రీను, మహిళా కార్యదర్శి శెట్టి సంధ్యారాణి, జాయింట్ సెక్రటరీ షేక్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.






