3 May, 2026 | 5:12 PM

65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించండి

07-08-2025 01:46 AM

- ఈ నెల 9 లోగా ఇవ్వాల్సిందే

- ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

- ఎస్‌ఐఆర్‌పై 12 న విచారణ

ఢిల్లీ, ఆగస్టు 6 : బీహార్‌లో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను ఈనెల 9 లోగా సమర్పించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. బీహార్‌లో ఎన్నికల నేపథ్యంలో ఓట ర్లు జాబితా నుంచి దాదాపు 65 లక్షల మం ది  ఓటర్లను తొలగించామని ఈసీ ఇటీవల ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలు తీ వ్రంగా ఈసీపై తీవ్రస్థాయిలో మండిపడ్డా యి. ఈ నేపథ్యంలో బీహార్‌లో ఈసీ ఓటర్ల ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)ను నిర్వహించ డాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫా ర్మ్స్(ఏడీఆర్) అనే స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

అలాగే తొలగిం చిన ఓటర్ల వివారాలు వెల్లడించాలంటూ మ రో పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సు ప్రీంలో విచారణ జరిగింది. ఇప్పటికే  ఓటర్ల వివరాలను వివిధ పార్టీలకు అందించిన నేపథ్యంలో ఏడీఆర్‌కు కూడా అందించాలని ఈసీని ఆదేశించింది. అయితే ఓటర్ల తొల గింపునకు గల కారణాలను ఈసీ తెలప లేదని ధర్మాసనానికి ఎన్‌జీవో తరఫు న్యా యవాది తెలిపారు.

ఓటరు జాబితా నుంచి కొంతమంది  ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీ సేశారని న్యాయవాది ఆరోపించారు.ఈసీ ప్రస్తుతం జాబితా వివరాలను మాత్రమే అం దిస్తుందని, ఆ తరువాత కారణాలను వెల్లడి స్తుందని సుప్రీం పేర్కొన్నది. ఎస్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ నెల 12న విచారిస్తామని, అక్కడ తమ వాదనుల వినిపించుకోవచ్చని సుప్రీం పేర్కొన్నది.