calender_icon.png 10 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్తవ్య భవన్ ప్రారంభం

07-08-2025 01:48:06 AM

- సీసీఎస్ బిల్డింగ్ ప్రారంభించిన ప్రధాని మోదీ

- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే చోటుకు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నింటినీ ఒకేచోట చేర్చే ‘కామన్ సెంట్రల్ సెక్రటేరియ ట్ బిల్డింగ్స్’లో మొదటిదైన ‘కర్తవ్య భవన్ 3’ని భారత ప్రధాని మోదీ బుధవారం ప్రా రంభించారు. ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఇక్కడి నుంచే పనిచేయనున్నాయి. ఈ తరహాలో 10 కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్‌లు నిర్మించేందుకు కేంద్రం సంకల్పిం చింది.

సీసీఎస్ పరిగణిస్తున్న కర్తవ్య భవన్‌లోకి కేంద్ర హోం, విదేశీ వ్యవహారా లు, పెట్రోలియం శాఖ, ప్రధాన మంత్రి ప్రి న్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయాలు తరలించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీసీఎస్ సీసీఎస్ భవ నాలు వచ్చే నెలకి పూర్తి కానుండగా.. సీసీఎస్ భవనం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటి కి, 6వ, 7వ భవనాలు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశముంది. 2019లో ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో సిద్ధమైన మొదటి భవనమిదే కావడం గమనార్హం. 1950 మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్‌లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సీసీఎస్ ప్రాజెక్టు కింద నిర్మితమ య్యే కొత్త భవనాల్లోకి క్రమంగా మారనున్నాయి.