calender_icon.png 10 August, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ యుద్ధాలకు కోర్టులను ఉపయోగించుకోవద్దు

07-08-2025 01:45:08 AM

- పార్టీలకు సుప్రీంకోర్టు హితవు

- మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు నిలిపివేత

- పథకాలకు నేతల పేరు పెట్టుకోవవచ్చు

ఢిల్లీ, ఆగస్టు 6 : రాజకీయ యుద్ధాలకు కోర్టులను ఉపయోగించుకోవద్దని పార్టీలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. సంక్షేమ పథ కాల్లో పీఎం, సీఎం పేర్లు, ఫొటోలు ఉపయో గించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోంద ని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వి త్ యూ స్టాలిన్’ పేరుతో తమిళనాడు ప్రభు త్వం నిర్వహిస్తున్న ప్రచారం కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం  చేస్తూ ఇటీవల అన్నా డీఎంకే రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మ ద్రాసు హైకోర్టులో పిల్ వేశారు. ఈ క్రమం లో కొత్తగా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో బతికి ఉన్న నేతల పేర్లు వాడకూడదని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పథకాల గురించి ప్రచారం చేసేటపుడు మాజీ సీఎంల ఫొటోలు, పార్టీ జెండాలు, గుర్తులను ఉపయోగించకుండా నిషేధించింది. 

సుప్రీం తలుపు తట్టిన తమిళనాడు  

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళ నాడు ప్రభుత్వం సుప్రీం గడప తొక్కింది. సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మా సనం దీనిపై విచారణ జరిపింది. అనేక రాష్ట్రాల్లో నాయకుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టారని, దీనిపై ఎటువంటి నిషేదా జ్ఞలు లేవని ధర్మాసనానికి తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా హైకో ర్టులో పిల్ దాఖలు చేసిన పిటిషనర్‌పై ధర్మా సనం అసహనం వ్యక్తం చేసింది. పిటిష నర్‌కు నిజంగా ఆందోళన ఉంటే అన్ని పా ర్టీలకు చెందిన నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాల్  చేయలేదని ప్రశ్నించింది. పలు పథకాలకు పీఎం, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు వాడుకోవచ్చని గతంలోనే సుప్రీం అనుమతిచ్చిందని తెలి పంది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని, మీ రాజకీయ పోరా టాల కోసం కోర్టులను వేదికలుగా చేసుకో వద్దని సుప్రీం ధర్మాసనం హతవు పలికింది. చెన్నై హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. అలాగే పిటిషనర్‌కు రూ.10 లక్షల జరి మానా విధించింది.