ఖానాపూర్‌లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థుల విజయపరంపర
29-04-2026 09:00 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయ పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించగా దానిలో సాయి శ్లోక 600 గాను 585 మార్కులు సాధించి మండలంలోని అత్యధిక మార్కులు టాపర్ గా నిలిచింది అలాగే మేకర్తి సంకల్ప 577, మార్కులు దాదే మల్లిక 566, గంగుల మల్లేష్ 564 మార్కులు, సాధించి ఫలితాల్లో ముందున్నారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ గాండ్ల కీర్తి, శ్రీనివాస్ ,తల్లిదండ్రులు అభినందించారు.






