calender_icon.png 23 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలా

03-10-2024 01:42:22 AM

సురేఖ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆర్‌ఎస్పీ మాట్లాడారు.

కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని... కేటీఆర్‌పై చేసిన ఆరోప ణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.