calender_icon.png 23 January, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడాకులు నా వ్యక్తిగత విషయం

03-10-2024 01:43:45 AM

నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి 

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

హైదరాబాద్, అక్టోబర్ ౨ (విజయక్రాంతి) : కొండా సురేఖ వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. విడాకులు తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని స్పష్టంచేశారు. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. ‘ఒక మహిళగా బయటకు వచ్చి, గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ.. నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్న చూపు చూడకం డి.

ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయన్న విషయాన్ని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటా.. అలాగే ఉండటం కొనసాగిస్తా’ అని సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.