18 April, 2026 | 4:02 AM

శ్రీవారిని దర్శించుకున్న సుడా చైర్మన్

18-04-2026 01:02 AM

కరీంనగర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల సుడా చైర్మన్ కూతురు వివాహం జరిగిన విషయం తెలిసిందే. నూతన వధూవరులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారిని ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం చేసుకున్నారు.