సుడా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యమా?

05-10-2026 | 05:30am
  1. అనుమతులు, టాక్స్‌ల భారం గ్రామాలపై..
  2. అభివృద్ధిలో మాత్రం రిక్త హస్తం
  3. ఆశించిన లక్ష్యం నెరవేరని వైనం

మానకొండూరు, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పట్టణాలతో పాటు గ్రామాలను అభివృద్ధిలో(Village development) అగ్రగామిగా ని లపాలనే సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. అంతర్గత రో డ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా,  విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతులకు పంచాయతీలలొ నిధులు స రిపడక పల్లె సీమలు కూనరిల్లుతున్నాయి. అనుమతులు ఇచ్చే అధికారం సుడాకు ఉన్నా, లక్షల్లో టాక్స్ లు వసూ లు చేస్తున్నా  గ్రామాల అభివృద్ధికి మాత్రం మొండి చే యి చూపుతున్నదనే విమర్శలు ఉన్నాయి.

సుడా ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధికి ఆశించిన ప్రయోజనం నెరవే రిందా అని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్ పరిసర గ్రామాలను పట్టణాభివృద్ధి పరిధిలోకి తీసుకొచ్చి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)(Satavahana Urban Development Authority ) పై ఇప్పుడు గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టాక్స్‌లు వసూలు..

గ్రామంలో సొంత ఇంటిని నిర్మించుకునే సామాన్యుడు సైతం అనుమతుల కోసం సుడా కు లక్షలు  చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, అదే గ్రామంలో అంతర్గత రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ వంటి కనీస సౌకర్యాల కోసం ప్రజలు ఇంకా ఎదురుచూడాల్సి వస్తోందనీ పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో సుడా  పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. రూ.10 కోట్ల వరకు అభివృద్ధి పనుల ప్రణాళికలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ నిధుల ప్రకటనలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో కనిపించే స్థాయిలో అభివృద్ధి కనబడటం లేదనే విమర్శలున్నాయి .

2041 ప్రణాళికలు.. కనపడని పల్లెల సమస్యలు

2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ పొందించిన మాస్టర్ప్లాన్లో సుడా పరిధిలోని 62 గ్రామాలు  పరిగణనలోకి తీసుకున్నారు. రింగ్రోడ్లు, కమర్షియల్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు, భవిష్యత్ పట్టణ విస్తరణ వంటి భారీ ప్రణాళికలున్నాయి. భవిష్యత్ పట్టణీకరణ కు ఇంత పెద్ద ప్రణాళికలు ఉన్నప్పుడు, ప్రస్తుతం ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌ లిక వసతులు ఎందుకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నది సహజమైన ప్రశ్న. లే అవుట్ల అనుమతులు, నిర్మాణ నియంత్రణలు, ఫీజుల వసూళ్లతో పాటు ఆదాయం వచ్చే గ్రామాలకే తగిన మౌలిక వసతులు కల్పించే విధానాన్ని సుడా  అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సుడా పరిధిలోని ప్రధాన మండలాలు

సుడా పరిధిలో కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి. ఈ 10 మండలాలు మొత్తం సుడా పరిధిలో ఉన్నా, సుడా పరిధి ప్రత్యేకంగా నోటిఫై చేసిన గ్రామాల, గ్రామ పంచాయతీల ఆధారంగా సుడా పరిధిలో చేర్చారు.  మానకొం డూరులో రూ.30 లక్షల వ్యయంతో మానకొండూరు మసీదు వాడలో డ్రైనేజీ  పూర్తయింది. సుడా నుంచి మరో రూ.45 లక్షలతో వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ఒకవైపు డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఒక్కటి మినహా సుడా పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి కోసం సుడా నిధులు కేటాయించిన దాఖలాలు లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్షలు కడుతున్నాం..

మా గ్రామంలో ఒక్కో ఇం టి నిర్మాణానికి అనుమతు ల కోసం లక్షల్లో కడుతు న్నాం. ఐతే, ఊర్లో ఏదైనా అభివృద్ధి పని చేయాల ంటే మాత్రం సుడా నుంచి ఒక్క రూపాయి ఇవ్వడం లే దు. వీధుల్లో రోడ్లు, తాగు నీరు, వీధి దీపాలు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న పట్టింపు లేదు. అధికారులను అడిగితే నిధులు రావట్లేదని చెప్తున్నారు. గ్రామాల నుంచి ఆదాయం వస్తున్నప్పటికీ అ భివృద్ధి కి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. ఇకనైనా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిం చి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా.

 వ్యాట గోపాల్ రెడ్డి, జగ్గయ్యపల్లి, మానకొండూరు

మరిన్ని వార్తలు