28 May, 2026 | 2:50 AM

తెలంగాణ జూనియర్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు ఎంపికైన సుధాన్వి

28-05-2026 02:04 AM

జగిత్యాల, మే 27 ( విజయక్రాంతి ) :తెలంగాణ జూనియర్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు ఎంపికైన జగిత్యాల క్రీడాకారిణి సుధాన్వి ని జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ మేరకు తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు న్న జూనియర్ బాస్కెట్ బాల్ లీగ్ అండర్ - 15 టోర్నమెంట్ కు ఇటివల జరిగిన టీ జి బి ఎల్ ఆటగాళ్ళ వేలం లో జగిత్యాలకు చెం దిన వడ్డేపల్లి సుధాన్వి నిజాం రాయల్స్ జ ట్టుకు సుధాన్వి ఎంపికైనట్టు తెలిపారు.

ఈ సందర్భంగారాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్న సుధాన్విని అభినందిస్తూ ము న్ముందు జగిత్యాల జిల్లా నుండి మరింత మంది క్రీడాకారులు కూడా ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పిడి విశ్వ ప్రసాద్, కృష్ణ ప్రసాద్, నిరంజన్, వేణు, సీనియర్‌క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.