29 July, 2026 | 9:12 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ త్రికాల

18-05-2026 01:13 AM

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్సులు, అజయ్ పవర్ ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లా డుతూ.. “ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది” అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది” అని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రమేశ్వర్; నేపథ్య సంగీతం: షాజిత్ హుమాయున్; డీవోపీ: పవన్ చెన్న.