15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

మరో నేత కార్మికుడి ఆత్మహత్యl

21-10-2024 12:09 AM

ఆర్థిక ఇబ్బందులే కారణం

సిరిసిల్ల, అక్టోబర్ 20: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతకార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. బీవై నగర్‌కు చెందిన ఆడెపు సంపత్(60) నేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలలుగా వస్త్ర పరిశ్రమ మూతపడటం, చేతినిండా పనులు లేకపోవడం, అప్పులు వారి ఇబ్బందులు, దీనికితోడు అనారోగ్య సమస్యలు ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన సంపత్ ఆదివారం తెల్లవారుజామును ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య భాగ్య తన కూతురు కవితకు పురుడు పోసేందుకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారినా ఇంటి తలుపులు తీయకపోవడంతో కొడుకులు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు.