15 June, 2026 | 2:00 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలే

21-10-2024 12:09 AM

ఎమ్మెల్సీ కోదండరాం

కామారెడ్డి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగా ణ రాలేదని, చర్రితను వక్రీకరించి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శిం చారు. ఆదివారం కామారెడ్డిలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఉద్యమకా రులకు అడుగడునా అవమానం, అన్యాయం జరిగిందన్నారు.

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తరువాత నిజామాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూ ములను కబ్జాచేసిందని ఆరోపించారు. నిజామాబాద్‌లో ఎల్లమ్మ గుట్టలో ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉన్న భూమిలో తెలంగాణ భవన్ నిర్మించారని ఆరోపించారు. అనంతరం జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల శర్మ ఆధ్వర్యంలో  కోదండరాంను సన్మానించారు.