8 June, 2026 | 7:36 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

మామాఅల్లుళ్లకు ‘సుఖర ముఖం’శిక్ష

05-09-2024 01:21 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నాయకులేనని, ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చెరువుల కబ్జాల పాపం కేసీఆర్, హరీశ్‌రావుదేనని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మామ అల్లుళ్లకు ‘సుఖర ముఖం’ శిక్ష పడ టం ఖాయమని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కేవలం ట్విట్టర్‌లో లొల్లి పెట్టడానికే పనికొస్తారని, తొందరపడి మాట్లాడటం, తర్వాత క్షమాపణలు చెప్పడంలో గిన్నిస్‌బుక్ రికార్డ్‌ల్లో ఎక్కారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నాలాల అక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా తెచ్చారని తెలిపారు. వరంగల్‌లో బీభత్సం జరగడానికి చెరువుల అక్రమణనే కారణమన్నారు.