మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
29-04-2026 12:39 AM
సుల్తానాబాద్ , ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): హైదరాబాద్ లో అసెంబ్లీ వద్ద ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,12 మంది కౌన్సిలర్స్ మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు , ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించడం జరిగింది అని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ తెలిపారు, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా కోరడం జరిగింది అన్నారు,ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది అని , ఒక రోజు మున్సిపల్ కార్యాలయాన్ని తప్పకుండా సందర్శిస్తానని మాట ఇచ్చారని రాధాకృష్ణ తెలిపారు.






