21 May, 2026 | 3:00 AM

కరీంనగర్‌లో సమ్మర్ క్యాంపులు

21-05-2026 01:35 AM

విద్యలో వినూత్న కార్యక్రమం డా. అశ్విని తానాజీ వాకడే, ఐఏఎస్.

ముకరంపుర, మే 20(విజయ క్రాంతి)ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, జిల్లా కలెక్టర్ & చైర్ పర్సన్ సమగ్ర శిక్ష మార్గదర్శకత్వం లొ కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.మే 15 నుండి ప్రారంభమై 15 రోజుల సమ్మర్ క్యాంపులు ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ మరియు టీజీఎంఎస్ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. 11 ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు విద్యా ప్రగతి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత, శారీరక దృఢత్వం మరియు వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు కల్పిస్తున్నారు.

పారమిత హెరిటేజ్ , పద్మనగర్, పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు.జిల్లా విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష ఎక్స్-ఆఫిషియో జిల్లా ప్రాజెక్టు అధికారి డా. అశ్విని తానాజీ వాకడే, మాట్లాడుతూ, క్యాంపులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సృజనాత్మక మరియు నైపుణ్యాధారిత అభ్యాస కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.తరగతి గదులకు అతీతంగా జరిగే విద్యాభ్యాసం విద్యార్థులను భవిష్యత్ కు సిద్ధం చేసి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తుందని ఆమె పేర్కొన్నారు.స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలను క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి మరియు గంగాధర మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రావు పర్యవేక్షిస్తున్నారు.