calender_icon.png 19 February, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల కోసం సమ్మర్ హాలిడేస్

19-02-2026 02:56:47 AM

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన ఇటీవల పంపిణీ చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్’పై ఓ కొత్త సినిమాను అందించేందుకు ధీరజ్ సిద్ధమవుతున్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో రానున్న బాల చిత్రం ఇది.

ఈ సినిమా టైటిల్‌ను బుధవారం ప్రకటించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించారు. మే 1 ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: సాయిప్రకాశ్; సంగీతం: సింజిత్ యెర్రమల్లి.