19-02-2026 02:58:01 AM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేట ర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కథానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఫస్ట్ హాఫ్ యంగ్ బ్యాచ్ పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అవుతారు.
సెకండ్ హాఫ్ అంత ఫ్యామిలీస్‌కు విపరీతంగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు కుర్రాళ్లకు, ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా. ఒక స్ట్రెస్ బస్టర్‌లాగా ఉంటుంది. డైరెక్టర్ మారుతిరావు ఒంగోలు నేపథ్యంలో తీసుకున్నారు. చాలా కొత్త పదాలు ఇందులో ఉంటాయి” అని చెప్పారు. హీరోయిన్ నయన సారిక మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు.
మామూలుగా ఉండే లవ్‌స్టోరీ కాదు. చాలా మలుపులు ఉన్నాయి” అన్నారు. ‘శ్రీవిష్ణు నుంచి ఏవైతే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో ఉంటాయ’ని డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు తెలిపారు. నిర్మాత సుమంత్ మాట్లాడుతూ.. ‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. 28న మా విష్ణు చేసే విన్యాసం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రధన్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.