ముగిసిన వేసవి శిబిరం
నిర్మల్,(విజయక్రాంతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), మామడలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న హాజరయ్యారు. నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధికి KGBVల ద్వారా అందిస్తున్న నాణ్యమైన వసతి, భోజనం, విద్యా సౌకర్యాలను వివరించారు. శిబిరంలో Simple Present, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా, క్రీడలు, కళలు, లైఫ్ స్కిల్స్ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు DEO గారి చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారిణి నవీన జ్యోతి, KGBV స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, CRTలు, సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






