విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
12-05-2026 01:21 AM
కేసముద్రం, మే 11 (విజయక్రాంతి): ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలలో మొదటి రోజున పీఎంశ్రీ కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణా తరగతులను కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చక్కని శిక్షణ తీసుకొని వివిధ రకాల స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ యాదగిరి, హెచ్ ఎం రాజు , ఏఏపీసీ చైర్మన్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ అవసరమైన సామాగ్రిని అందజేశారు.






