12 May, 2026 | 2:26 AM

అల్ఫోర్స్‌లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచనం

12-05-2026 01:09 AM

కొత్తపల్లి, మే 11 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లిఅల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో గత ఐదు రోజులుగా వేడుకగా నిర్వహిస్తున్న సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం  సోమవారం ముగిసింది. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి  ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎల్ రాజ భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీరామచంద్ర స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు.

ఆంజనేయుని వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని  పెంపొందించుకోవాలని, ఆటంకాలను అధిగమించాలని అన్నారు.  రామాయణం మహా అద్భుతమైన కావ్యమని, రామాయణంలోని విషయాలను సమాజంలో అమలుపరచినట్లయితే ప్రతి రంగంలోనూ విజయాలను నమోదు చేయగలుగుతామని, తద్వారా ఉత్తమమైన స్థానాన్ని సైతం కైవసం చేసుకోగలుగుతామని చెప్పారు.  విద్యార్థుల ప్రదర్శించిన పలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త మహేశ్వర శర్మ, రెడ్డి సంఘం నాయకులు సంధి తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.