01-02-2026 02:22:40 AM
ముంబై, జనవరి 31 : మహారాష్ట్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవా ర్ ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సునేత్రా పవార్ చేత శనివా రం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడంతో.. ఆయన భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
వారి కుమారు డు పార్థ్ పవార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆమెను నిలబెట్టడం ద్వారా పార్టీపై పట్టు సాధించాలని ఎన్సీపీ వర్గం భావిస్తోంది. అదే సమయంలో శరద్ పవార్ వర్గంతో విలీనంపై చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా..
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్రా పవార్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజబల్ సునేత్రా పవార్ పేరును ప్రతిపాదించగా.. ఇతర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సునేత్రా పవార్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
సునేత్రా పవార్ రికార్డు
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహి ళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలిసారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదా లో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీ పీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సాయంత్రం రాజభవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
అజిత్ చివరి కోరిక..
ఎన్సీపీ రెండు కూటములు ఒక్కటవ్వాలన్నదే అజిత్ పవార్ కోరిక అని శరద్ పవార్ తెలిపారు. ఈ విషయంపై నాలుగు నెలలుగా అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్ చర్చలు జరిపారని, రెండు వర్గాల విలీనానికి ఫిబ్రవరి 12వ తేదీని ఫిక్స్ చేశామని కూడా చెప్పారు. అయితే, ఈలోపు దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని చెప్పారు. దీంతో విలీన చర్చలకు బ్రేక్ పడిందని వివరించారు. అజిత్ పవార్ చివరి కోరిక నెరవేరాలని తమ కుటుంబం కోరుకుంటోందని శరద్ పవార్ తెలిపారు.
సునేత్రా డిప్యూటీ సీఎం పగ్గాలపై సమాచారం లేదు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే విషయం తనకు తెలియదని, తనతో ఎవరూ చర్చించలేదని శరత్‌పవార్ తెలిపారు. ఉదయం న్యూస్ పేప ర్ల ద్వారా అజిత్ పవార్ కూటమి సభ్యు లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మాత్రమే తనకు తెలిసిం దన్నారు. ఆ పార్టీ తరఫున సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని సునేత్రా పవార్ నిర్ణయించుకున్నట్లు తమ కుటుంబానికి తెలియదని శరద్ పవార్ స్పష్టం చేశారు.