01-02-2026 03:10:35 AM
ఏపీ సీఎం చంద్రబాబును దూషించినందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమరావతి, జనవరి 31: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై శనివారం వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీటీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అలాగే చం ద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేత లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాత్రి అంబటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అంతక ముందే తనను పోలీసులకు దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు. జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగాఉన్నానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రం గా ఖండించారు. వైసీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.