12 July, 2026 | 10:57 AM

నీట మునిగిన ఎంపీల నివాసాలు

29-06-2024 12:59 AM

న్యూఢిల్లీ జూన్ 28: ఢిల్లీలో నివాసం ఉంటున్న పలువురు ప్రజాప్రతినిధుల నివాసాలు నీటమునిగాయి. కానీ కొందరు అష్టకష్టాలు పడుకుంటూ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లారు. తిరువన ంతపురం ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియా లో పరిస్థితిని వివరించారు. “నేను లేచే సరికి ఇల్లు మొత్తం నీటితో నిండిపోయింది. ఇంటిలో సామగ్రి మొత్తం వాన నీటితో తడిసిపోయింది. వరదనీరు వెళ్లేం దుకు ఉన్న డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అ య్యాయి” అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. 

అధ్యక్షా అనేందుకు అవస్థలు..

లోథి ఎస్టేట్‌లో నివాసం ఉంటున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ వర్షం వల్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆయన ఇంటి చుట్టు ప్రాంతాలు మొత్తం వాననీటితో మునిగిపోయాయి. కానీ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండ డంతో ఆయన పార్లమెంట్‌కు చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఆయనను సిబ్బంది మోసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.