3 April, 2026 | 3:10 AM

దేవాదాయ డిప్యూటీ కమిషనర్‌గా సునీత

03-04-2026 12:00 AM

వీరభద్రుడికి గుమ్మడికాయ నైవేద్యం

వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు

భీమదేవరపల్లి ,ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ గా రామాల సునీత నియామకం అయ్యారు గతంలో వరంగల్ ఏసీబీ గా పనిచేసిన రామాల సునీత మళ్ళీ ఇక్కడే డీసీపీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మొగిలిపాలెం లలితాదేవి రాంబాబు ముఖ్య అర్చక మనవడు మొగిలిపాలెం రుద్ర, డిప్యూటీ కమిషనర్ గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త కొండకు దర్శనానికి వచ్చిన సందర్భంగా ముఖ్య అర్చక దంపతులు డిసిపి ని శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సునీత కొత్తకొండ వీరభద్రుని ఆలయానికి విచ్చేసి స్వామివారికి ఇష్టమైన గుమ్మడికాయ నైవేద్యంగా సమర్పించారు. సన్మానం చేసిన వారిలో ఆలయ అర్చకులు తాటికొండ వీరభద్రయ్య వినయ్ శర్మ, గుడ్ల శ్రీకాంత్, రమేష్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.