రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
03-04-2026 12:00 AM
కొండపాక, ఏప్రిల్ 2: కొండపాక శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే కొండపాక కు చెందిన సంతోష్ సిద్దిపేట నుంచి కొండపాక కు ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో శశి అనే వ్యక్తి కొండపాక నుంచి రాజీవ్ రహదారి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం కొండపాక శివారులో వేద స్కూల్ సమీపంలో ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టడంతో కింద పడిపోయారు.
దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సంతోష్, శశి లను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం కిందపడి దూసుకెల్లడంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో దగ్ధమైంది.




