సన్‌రైజర్స్ జైత్రయాత్ర
రాజస్థాన్‌పై ఘనవిజయం
ఇషాన్, అభిషేక్ మెరుపులు
వైభవ్ సెంచరీ వృథా
హోంగ్రౌండ్‌లో హ్యాట్రిక్ విజయాలు సన్‌రైజర్స్‌కు తిరుగులేని ఉత్సాహాన్నిచ్చాయి. అదే జోష్‌తో బయటి వేదికల్లో సైతం జైత్రయాత్ర మొదలుపెట్టింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. 229 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది రెండో అత్యధిక ఛేదన. అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ విధ్వంసంతో హైదరాబాద్ అలవోకగా గెలుపును అందుకుంది.
జైపూర్, ఏప్రిల్ 25: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్ హెచ్ ఫీ ల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కమిన్స్ తిరిగి వచ్చాడు. అయితే రాజస్థాన్ రాయ ల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ దూకుడుగా ఆడారు. జైస్వాల్ 10 పరుగులకే ఔటైనా వైభవ్ మాత్రం రెచ్చిపోయాడు. తన సూపర్ ఫామ్ కొన సాగిస్తూ విధ్వంసం సృష్టించాడు. మరోసారి 15 బం తుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వా త మరింత దూకుడుగా ఆడ డంతో రాజస్థాన్ స్కోరుబోర్డు టాప్ గేర్‌లో సాగింది. అటు జురెల్ కూడా ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ సా ధించాడు. వీరిద్దరూ 112 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేయగా.. వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్సర్‌తో సెంచరీ కంప్లీట్ చేసుకున్న ఈ చిచ్చర పిడుగు పలు రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 50 సిక్స ర్లు బాదిన ప్లేయర్‌గా రికా ర్డు సృష్టించాడు.
కేవలం 15 ఇన్నింగ్స్‌లోనే అతను ఈ ఫీట్ అందుకున్నాడు. తర్వా త వికెట్లు పడినా ఫెరీరా(33) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హెడ్ (6) పరుగులకే ఔటయ్యాడు. అ యితే ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ తన ఫా మ్ కంటిన్యూ చేయగా.. ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 55 బంతుల్లోనే 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మ 29 బం తుల్లో 57 పరుగులు చేశాడు. అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగింది.కేవలం 31 బంతుల్లోనే 74 (11 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశా డు. తర్వాత క్లాసెన్ (29), నితీష్ రెడ్డి(36) ఎటాకింగ్ బ్యాటింగ్‌తో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో అరోరా, అనికేత్ వర్మ సన్ రైజర్స్ విజయాన్ని పూర్తి చేశారు. ఫలితంగా సన్ రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది.
స్కోరు బోర్డు
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 228/6 ( వైభవ్ సూర్యవంశీ 103, జురెల్ 51, ఫెరీరా 33, మలింగ 2/38, కమిన్స్ 1/27)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 229/5 (ఇషాన్ కిషన్ 74, అభిషేక్ శర్మ 57, నితీశ్ రెడ్డి 36 ; ఆర్చర్ 2/34, బ్రిజేశ్ 2/44)






