27 June, 2026 | 7:27 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మూఢ నమ్మకాలతో జీవితాలు బుగ్గి

14-06-2025 12:40 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మూఢనమ్మకాలతో ప్రవర్తించి జీవితాలను బుగ్గిపాలు చేసుకోకూడదని, నాగరిక ప్రపంచంలో అనాగరికమైన చర్యల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో పోలీసు కళాజాత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై దీపిక, ఏఎస్ఐ సూరయ్య, కానిస్టేబుళ్లు వెంకన్న, సురేష్, కళాబృందం సభ్యులు పృద్వి, సతీష్, తిరుపతి పాల్గొన్నారు.