18 April, 2026 | 5:05 AM

జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

14-06-2025 12:39 AM

సంగారెడ్డి, జూన్ 13: వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులో 50 శాతం రాయితీ వర్తించేలా  సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజులో రాయితీ కల్పించాలని సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్  అధ్యక్షులు ఎం.సాయినాథ్, ఉపాధ్యక్షులు ఎర్ర. వీరేందర్ డీఈవోను కోరారు. దీనికి డీఈవో వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు.

వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా పాఠశాల యాజమాన్యం వినకపోతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాయినాథ్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లాలోని జర్నలిస్టులు వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు.