29 March, 2026 | 5:15 PM

విచారణ జరపాలి

29-03-2026 03:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ క్రికెట్ రంగంలో ఆరోపలపై జస్టిస్ కాక్రో ఇచ్చిన నివేదిక మేరకు సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. రూ.69 కోట్ల విశాఖా ఒప్పందం దోపిడి నుంచి హెచ్సీఎ క్లబ్బుల అక్రమ ప్రైవేటీకరణ వరకు పలు కీలక అంశాలపై,  ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవా అన్నారు. విశాఖ ఒప్పందం వల్ల జరిగిన భారీ ఆర్థిక నష్టంపై ఇప్పటికీ రికవరీ చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదే సమయంలో,80 అక్రమ ప్రైవేట్ క్లబ్బులు, అలాగే గతంలో ఉన్న 103 క్లబ్బులు గల్లంతవడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

తాము చేసే ఈ ఆరోపణలతో పాటు హెచ్సీఎ వ్యవహారాలపై పర్యవేక్షణ కోసం నియమించిన జస్టిస్ ఎన్.ఏ. కాక్రు కమిటీ నివేదికలో సభ్యత్వ వ్యవస్థలో భారీ అవకతవకలు బయటపడిన ట్లు తెలిపింది. కేవలం 10 మంది చేతుల్లో 70 క్లబ్బులు ఉండటం, క్లబ్బుల కొనుగోలు అమ్మకం జరుగు తుండటం, ఒక్క క్లబ్ ధర రూ.1 నుంచి2 కోట్ల వరకు ఉండటం వంటి అంశాలు బయటపడినట్లు ఆ యన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ టికెట్ల స్కామ్పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంప్లిమెంటరీ టికెట్లు, ప్లేయర్ పాసులు బ్లాక్ మార్కెట్లో విక్రయించబడుతున్నాయని, అసలు అభిమానులకు అవి అందడం లేదని టీ సి ఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు పేర్కొన్నారు.