28 February, 2026 | 3:34 PM

పర్యవేక్షణ లేక గిరిజన పాఠశాలలో అవస్థలు

28-02-2026 12:00 AM

వాంకిడి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లోపై అధికారుల పర్యవేక్షణ కొరవడ టంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికా రులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరై, సమయపాలన పాటించకుండా వ్యవ హరిస్తున్నారని పేర్కొన్నారు.

దీని ప్రభావం నేరుగా గిరిజన విద్యార్థుల చదువుపై పడుతోందని తెలిపారు. శుక్రవారం రింగారైట్ గిరిజన ప్రాథమిక పాఠశాలను పరిశీలించగా, తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాత్రమే ఉండగా విద్యార్థులు కనిపించలేదు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, బయట ఆడుకుంటూ ఉన్నారు. ఉపాధ్యాయుడు తరచూ పాఠశాలకు రాకపోవడం, వచ్చిన రోజుల్లో కూడా బోధన చేయకుండా హాజరు నమోదు చేసి విద్యార్థులను పంపిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ విషయంపై వాంకిడి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ను సంప్రదించి వివరణ కోరగా, సంబంధిత ఉపాధ్యాయుడికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు జారీ చేసి హెచ్చరించామని, త్వరలో విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.