28 February, 2026 | 7:11 PM

లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కలకలం

28-02-2026 12:00 AM

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 27 : మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలో పక్షం రోజుల నుంచి దొంగ నోట్లు చెలామణి అవుతున్న ప్రచారం జోరుగా జరుగుతోంది. 500 రూపాయల నోట్లు భారీగా చలామణి కావడంతో ప్రజల్లో, వ్యాపారస్తులు ఆందోళన మొదలైంది. దొంగ నోట్ల కేటుగాళ్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో సూపర్ మార్కెట్, మద్యం దుకాణాలు, ఆది వారం జరగనున్న అంగడిలను, గురు వారం జరగనున్న అంగడిలో ఈ దొంగ నోట్ల కేటుగాళ్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం.

రాత్రి పూట మద్యం దుకాణాలలో జనం ఎక్కువ ఉండడం గమనించి ఈ కేటుగాళ్లు మద్యం కోసం 500 రూపాయల దొంగ నోట్లు ఇచ్చి మద్యం తీసుకుపోతున్నారని సమాచారం ఉంది. గత 15 రోజుల నుంచి మద్యం దుకాణ యజమానులు, సిబ్బంది ఈ దొంగ నోట్లు రావడంతో వారు అప్రమత్తమై ప్రతి 500 రూ పాయల నోటు గమనించి తీసుకున్నట్లు తెలిసింది. గత నాలుగు రోజుల క్రితం సూపర్ మార్కెట్లో వచ్చిన దొంగ నోటుతో సమాచారం తెలుసుకున్న లక్షెట్టిపేట పోలీసులు అప్రమత్తమై ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దొంగ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు చలామణి చేస్తున్నారనీ, అనుమానం ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.