05-07-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం జులై 4 (విజయ క్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సహజ వనరుల రక్షణ, కార్మిక చట్టాల పరిరక్షణకోసం జూలై 9న జరిగే సార్వత్రిక స మ్మెకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలనీ కోరుతూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల, అసోసియేషన్ల పిలుపుమేరకు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన సెంటర్ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాలకేంద్రం నుంచి ప్రా రంభమైన ర్యాలీ ఎంజి రోడ్డు, పెద్దబజార్, బస్టాండ్, పోస్టాఫీసు మీదుగా బైపాస్ రోడ్డువరకు చేరింది. ర్యాలీ ప్రారంభ, ముగింపు సందర్బంగా ఏర్పాటుచేసిన సభలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, సిఐటియు జిల్లా నాయకులూ ఏజె రమేష్, ఐఎన్టియుసి జిల్లా నాయకులు జలీల్, ఐఎఫ్టియు, టియుఎల్‌ఈ జిల్లా నాయకులు సంజీవ్ ఏడుకొండలు మాట్లాడుతూ కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, జాతీయ సం పదను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌ కగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తుందని ఆరోపించారు.
డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలను పెంచి పేద, మధ్యతరగతివర్గాలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. కార్మిక చట్టాలను సవరించి శ్రామికుల శ్రమను యాజమాన్యా లు దోచుకునే విధంగా కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. ఈ పరిస్థితిలో జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్రానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వంగ వెంకట్, ఎస్ వి రమణమూర్తి, గెడ్డాడు నగేష్, బండారు మల్లయ్య, భూక్యా శ్రీనివా స్, సిఐటియు నాయకులు భూక్యా రమేష్, బాలకృష్ణ, బాలరాజు, ఐఎన్టియుసి నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.