10 May, 2026 | 8:11 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వైద్యుల నిర్లక్ష్యంతో రైతు మృతి

04-07-2025 10:30 PM

కొత్తపేట ఓజోన్ దవాఖానలో దారుణం 

మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ

ఎల్బీనగర్: వైద్యుల నిర్లక్ష్యంతో ఒక రైతు మృతి చెందిన ఘటన కొత్తపేట లోని ఓజోన్ దవాఖానలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.‌ వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి భగవంత్ రెడ్డి (60), భార్య దుర్గమ్మ (50). వృత్తిరీత్యా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30వ తేదీన ఒంట్లో నలతగా ఉందని ఎన్టీఆర్ నగర్ లోని ఓజోన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. భగవంత్ రెడ్డికి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు.

అందుకుగాను రూ. 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 2వ తేదీన ఉదయం సుమారు 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రెండు దఫాలుగా ఆపరేషన్లు నిర్వహించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాదాపు 20 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి, రెండు రోజులుగా ఎవరిని కూడా ప్రత్యేక చికిత్స విభాగానికి పోకుండా అడ్డుకున్నారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బాధిత రైతు కుటుంబ సభ్యుల ఐసీయూలోకి వెళ్లి చూడగా అప్పటికే భగవంత్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. రెండు రోజుల క్రితం చనిపోయిన మృతదేహానికి రక్తం ఎక్కించి తమను మోసం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు విచారణ చేస్తున్నారు.