3 March, 2026 | 5:17 AM

టీబీ రోగులకు అండగా కేర్

03-03-2026 12:00 AM

ఆస్పత్రిలో ‘ప్రాజెక్ట్ ఓజాస్’ ప్రారంభం

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): దేశంలో టిబి (క్షయవ్యాధి) నిర్మూలన లక్ష్యా న్ని సాధించేందుకు కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ కలిసి ప్రాజెక్ట్ ఓజాస్ అనే ప్రధాన సిఎస్‌ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్ లో టీబీ రోగులకు నిరంతర పోషకాహారం, మానసిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌కు అనుసంధానంగా చేపట్టబడిం ది.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి ప్రారంభించి, టిబి రోగులకు సిద్ధం చేసిన పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. వెంకటి; కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్; మెడికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ నిఖిల్ మాథుర్; నాంపల్లిలోని కేర్ హా స్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శశికాంత్ అగ్సారే; హైదరాబాద్ జిల్లా టీబీ కం ట్రోల్ ఆఫీసర్ డాక్టర్ చల్లా దేవి;

జగతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సీఈఓ దుర్గా కళ్యాణి; సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఫైజాన్ అజీజ్; నాంపల్లిలోని కేర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశిష్ మాథుర్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఓజాస్ ద్వారా రాబోయే ఆరు నెలల్లో దాదాపు 3,000 టిబి రోగులకు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.