బార్ కౌన్సిల్‌పై సుప్రీం ఆగ్రహం
- నల్సార్ విద్యార్థులకు జారీచేసిన నోటీసులు రద్దు
- పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: నల్సార్ న్యాయ విద్యార్థుల(NALSAR law students)పై క్రమశిక్షణా చర్యలు(disciplinary action) తీసుకునే అధికారం బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా){Bar Council of India}కు లేదని సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై న్యాయవాద విద్యార్థులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
బీసీఐ న్యాయ విద్యార్థులకు జారీ చేసిన రెండు నోటీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులపై చర్యలు తీసుకోవడం బీసీఐ బాధ్యతే అయినా, విద్యార్థులు న్యాయవాదులు అయ్యేంత వరకు వారిని నియంత్రించే చట్టబద్ధమైన అధికారం లేదని స్పష్టం చేసింది. నల్సార్ న్యాయవిద్యార్థులపై సీజేఐ సూర్యకాంత్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సమర్థించింది.
నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా సీజేఐ సూర్యకాంత్ వస్తున్నారన్న నేపథ్యంలో వ్యతిరేకంగా పలువురు న్యాయవిద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా 2026లో నల్సార్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందిన ఏ విద్యార్థి పేరును బార్ కౌన్సిల్‌లో నమోదు చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది కాస్త మరింత వివాదానికి కారణమైంది.






