30 May, 2026 | 2:47 AM

వినేశ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

30-05-2026 01:19 AM

ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతి

దేశమే అందరికంటే ముఖ్యమని వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 29: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిం ది. వినేశ్‌ను ట్రయల్స్‌కు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ విచారణ సందర్భంగా దేశానికి వినేష్ ఫోగాట్ చేసిన సేవ లను, సాధించిన విజయాలను న్యాయస్థానం గౌరవించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వినేష్ ఫోగాట్ క్రీడా విజయాలను ప్రశంసిస్తూ ఓ కీలక వ్యాఖ్య చేసింది. ఈ స్థానంలో వేరే ఏ అథ్లెట్ ఉన్నా పరిస్థితి వేరుగా ఉండేదనీ వినేష్ ఫోగాట్ అంతర్జాతీయ వేదికలపై భారత్ గర్వపడేలా చేసిందని కోర్టు పేర్కొంది.

అదే సమయంలో క్రీడా నియమాలను గుర్తు చేస్తూ మీరు దేశం గ ర్వించదగ్గ అత్యుత్తమ అథ్లెట్ అనడంలో సం దేహం లేదనీ, ఎప్పుడైనా, ఎవరికైనా దేశ మే అందరికంటే ము ఖ్యమనీ వినేశ్‌కు సు ప్రీంకోర్టు స్పష్టం చేసింది. వినేష్ ట్రాక్ రికార్డును బట్టి ఆమెకు ఈసారి మినహాయింపునిస్తూ ట్రయల్స్‌కు అనుమతించినప్పటికీ.. భవిష్యత్తులో క్రీడా విధానా లు, షెడ్యూలింగ్ విషయాల్లో క్రీడా సమాఖ్యల నిర్ణయాలకే ప్రాధాన్యత ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.