31 August, 2026 | 3:22 AM

మరణించిన కుటుంబానికి గిరిజనుల ఆర్థిక సాయం

31-08-2026 02:19 AM

మహమ్మదాబాద్, ఆగస్టు 30 : మండలంలోని మంగంపేట తండాకు చెందిన సభవత్ అంజ్యా (Sabhavat Anjya) కుటుంబానికి గిరిజన సోదరులు మానవతా దృక్పథంతో రూ.52 వేల ఆర్థిక సహాయం అందించారు. సౌదీ అరేబియాలో ఉన్న గిరిజనులు రూ.32 వేలు, తండావాసులు రూ.20 వేలు అందించి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సహాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారి మానవత్వాన్ని పలువురు అభినందించారు.