31 August, 2026 | 3:01 AM

దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది

31-08-2026 02:20 AM

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్‌నగర్, ఆగస్టు 30 : దైవభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని.. అందర్నీ సన్మార్గంలో నడిపిస్తుందని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (Deputy Mayor Marepally Surender Reddy) అన్నారు. నగరం లోని 2వ డివిజన్ ఏనుగొండలో శ్రీ అభయాంజనేయ స్వామి, శివాలయ దేవాలయాల పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్  మాట్లాడుతూ దేవాలయాల పునఃప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలు ప్రజలకు శుభప్రదమని అన్నారు. ఆంజనేయ స్వామి, పరమశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్ద గొల్ల నర్సింహులు యాదవ్, శేఖర్, మైత్రి యాదయ్య, రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.