20 April, 2026 | 6:05 PM

శబరిమల కేసులో కీలక మలుపు: మహిళల ప్రవేశంపై కేంద్రం స్టాండ్… సుప్రీంకోర్టులో హై టెన్షన్ విచారణ!

08-04-2026 01:38 AM

మహిళల ప్రవేశంపై కోర్టుకు కేంద్రం నివేదిక

వివక్ష లేదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పరిధికి సంబంధిం చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం నుంచి తుది విచారణను ప్రారంభించింది. కేంద్రం సుప్రీంకోర్టుకు తమ వివరణను సమర్పించింది. ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళలకు శబరిమల ప్రవేశంపై నిషేధం విధించామని, దీనికి సంబంధించిన వివక్ష ఏమీ లేదని కేంద్రం తరఫున సుప్రీంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

శబరిమల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు – పూర్తి వివరాలు తెలుసుకోం

ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలను కొనసాగించాలని సుప్రీంకోర్టును తుషార్ మెహతా కోరారు. సీజేఐ నేతృత్వంలోని 9 మంది జడ్జీల ధర్మాసనం శబరిమల మహిళల ప్రవేశంపై దాఖలైన పలు పిటిషన్ దారుల వాదనలను వింటోంది. శబరిమలలోకి 10 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రద్దు చేస్తూ 2018లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 


ఇవి కూడా చదవండి:

శబరిమల మహా పాదయాత్ర ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శబరిమల బంగారం చోరీ కేసు.. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరెస్ట్

ఇరుముడితో శబరిమల బయలుదేరిన ఆదర్శ్‌రెడ్డి

శబరిమల కేసులో కీలక మలుపు: మహిళల ప్రవేశంపై కేంద్రం స్టాండ్… సుప్రీంకోర్టులో హై టెన్షన్ విచారణ!

శబరిమల బయలుదేరిన బెజ్జంకి అయ్యప్పస్వాములు

శబరిమల క్షేత్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి

శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్