13 April, 2026 | 10:56 PM

అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి

08-04-2026 10:47 AM

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారురెండు వారాల కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Pakistan Prime Minister Shehbaz Sharif) అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ తమ 10 సూత్రాల ప్రతిపాదనకు అంగీకరించాలని ఇరాన్ కోరింది. పాక్ అభ్యర్థనతో ట్రంప్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకున్నామని ఇరాన్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము ప్రతిదాడులు ఆపుతామని ఇరాన్ కండిషన్ పెట్టింది.

అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇస్లామాబాద్ లో ఎల్లుండి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం లెబనాన్ లో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులకూ వర్తిస్తుందని పాక్ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతికి దోహదపడుతుందని పాకిస్థాన్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) ద్వారా 2 వారాల పాటు నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించింది. హర్మూజ్ నుంచి రాకపోకలు తమ సైనిక పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం

ఇరాన్‌పై అమెరికా బీ-2 బాంబుల దాడులు: 9 యుద్ధనౌకలు మునిగిపోయినట్లు ట్రంప్ ప్రకటన

ఇరాన్‌లో 200కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన— ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు

అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి

ఇరాన్‌కు కాళరాత్రి X ప్రాణాలిస్తాం!