calender_icon.png 24 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటాలోనే విద్యార్థులు

24-05-2025 12:59:03 AM

ఎందుకు చనిపోతున్నారు!

రాజస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఒత్తిడితో విద్యార్థులు విషం తాగడం, ఫ్యాన్‌లకు ఉరేసుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళనకరమైన అంశమంటూ రాజస్థాన్ గవర్నమెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కోటాలో మాత్రమే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని నిలదీసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, ఆర్ మహదేవన్ విచారించారు. కోటాలో ఇప్పటివరకు ఎంతమంది యువ విద్యార్థులు మరణించారు? విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు? అంటూ కోర్టు ప్రశ్నించింది.