24-05-2025 12:56:45 AM
అడవిలో నక్కిన నలుగురు ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కిష్తావర్ జిల్లాలోని చట్రూ అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉంటారనే అనుమానంతో భద్రతాబలగాలు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగించాయి. భద్రతాబలగాలతో పాటు పారా కమాండోలు, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ), సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కలిసి ఈ వేటను కొనసాగించారు. గురువారం రోజు టెర్రరిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మహారాష్ట్రకు చెందిన ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆర్మీ అధికారులకు గాయాలయినట్టు వారు ప్రస్తుతం మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.