08-01-2026 12:00:00 AM
సూర్యాపేట, జనవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలో గల ఏఎఫ్‌ఓ కన్సల్టెన్సీ కార్యాలయంలో బుధవారం లంబడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించాలని, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉపసర్పంచులు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరావు నాయక్, విజయ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.